మూడోసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచిన మాస్ రాజా..

మెగాస్టార్ చిరంజీవి తరువాత తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో అంచెలంచెలుగా అభిమానాన్ని చూరగొన్న హీరో రవితేజ మాత్రమే.. అన్ని వర్గాల్లోనూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుని మాస్ మహరాజ్ గా కొనసాగుతున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా అభిమానులను నిరాశపరిచినప్పటికీ ఈ సంక్రాంతికి తన తాజా చిత్రం క్రాక్ ద్వారా ముచ్చటగా మూడోసారి సంక్రాంతి హీరోగా నిలిచాడు. 2008, 2011లో సంక్రాంతికి వచ్చిన సినిమాలను బీట్ చేస్తూ విజేతగా నిలిచాడు రవితేజ. 2011లో ‘మిరపకాయ్’ సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇక 2008 సంక్రాంతికి వి.వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణ’ బ్లాక్బస్టర్ గా నిలిచింది. దీంతో సంక్రాంతికి తనదైన ముద్ర వేశాడు ఈ హీరో.