నందిగామ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ లోకి పలు గ్రామస్తుల చేరికలు

కృష్ణాజిల్లా నందిగామ: నందిగామ నియోజకవర్గంలో యువనాయకులు, మాదల రమేష్ కృషితో భారీ గా బీజేపీ పార్టీలో చేరిన ప్రజలు నందిగామ మండలం లోని మునగచెర్ల గ్రామములో కమ్మవారిపాలెం గ్రామంలో భారీ గా బీజేపీ లో చేరిన కుటుంబాలు నందిగామ మండల అధ్యక్షులు ఘంటా వెంకటరావు అధ్యక్షత న మునగచెర్ల గ్రామంలో మందలపు మురళీకృష్ణ ఆధ్వర్యంలో కమ్మవారిపాలెం లో కిలారు జగదీష్ ఆద్వర్యం లో పార్టీ లోకి చేరిన ప్రజలను విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్ బీజేపీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే అవినీతి పాలనకు అడ్డుకట్ట వేయగల సత్తా ఉన్న పార్టీ బీజేపీ అని అందుకే రాష్ట్రంలో ప్రజలకు బీజేపీ పార్టీ మీద నమ్మకంతో ముందు ముందు మరింత మంది పార్టీ లోకి చేరికలు వుంటాయని అలాగే ఈ రోజు బీజేపీ పార్టీ లో చేరిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి కృషి చేసిన నియోజకవర్గ ఇంచార్జి మాదల రమేష్ కి మండల అధ్యక్షుడు ఘంటా వెంకటరావు కి చండర్లపాడు మండల అధ్యక్షులు గుత్తా బాలకృష్ణ కి జిల్లా కిసాన్ మోర్చా కోశాధికారి శ్రీనివాసరావు చిరుమామిళ్ల కి అలాగే జిల్లా సోషలమీడియా కన్వీనర్ బోనం రామిరెడ్డి ని అభినందించారు. కార్యక్రమానికి సహకరించిన నందిగామ పట్టణ అధ్యక్షులు సీతారామయ్య కి అలాగే కంచికచర్ల అధ్యక్షులు శ్రీను కి కృతజ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సి బీసీ బీజేవైఎం మరియు మైనారిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్సులు ఉపాధ్యక్షులు వివిధ పదాదికారులు గ్రామ ప్రజలు విరివిగా పాల్గొన్నారు.