కన్నుల పండువగా ఉత్తర ద్వార దర్శనం.

వైకుంఠ ఏకాదశి (మంగళగిరి ముక్కోటి) సందర్భంగా మంగలాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు శ్రీ దేవి,భూదేవి సమేతంగా బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం అయింది. బుధవారం రాత్రి జాగరణ ఉన్న భక్తులు గురువారం తెల్లవారుజామునుంచే స్వామి వారిని దర్శించుకున్నారు. పురాతన దక్షణావృత శంఖు తో భక్తులకు అంతరాలయంలో తీర్ధం అందజేశారు. తీర్ధం స్వీకరించేందుకు భక్తులు బారులు తీరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు.