అసైన్డ్ భూముల్లో అవకతవకల పై రిటైర్డ్ తహసీల్దార్ కి మరో వ్యక్తి కి రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు.

రికార్డులు తారుమారు చేసి దళితులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశాడంటూ విజయవాడకు చెందిన సురేశ్ ను అరెస్ట్ చేశారు. దీనికి తోడు భూ రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్ బాబునుసీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.వీరిద్దరినీ సీఐడీ అధికారులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. వీరికి 29 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వీరిని గుంటూరు జైలుకు తరలించారు.