కుటుంబ కలహాలతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కృష్ణాజిల్లా నందిగామ శివారు డివిఆర్ కాలనీలో ఒక వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తీవ్ర గాయాలు అయిన సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది పోలీసులు అందించిన సమాచారం మేరకు డివిఆర్ కాలనీల్లో పెట్టి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన స్పందించిన స్థానికుల సహాయంతో 108 వాహనం ద్వారా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించార కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నందిగామ పోలీసులు,తీవ్రంగా కాలిపోవడంతో పరిస్థితి విషమం గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ కు తరలించినట్లు తెలిపారు. గాయాలైన వ్యక్తి డివిఆర్ కాలనీకి చెందిన ఎం వెంకటేశ్వరరావు గా గుర్తింపు భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.