మహేశ్ బాబుకు మాతృవియోగం

సూపర్ స్టార్ కృష్ణ భార్య .. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసారు. ఈ యేడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూసిన ఘటన మరవక ముందే తాజాగా కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నమూయడం విషాదకరం. ఆమె వయసు 70 యేళ్లు.  ఇందిరా దేవి దంపతులకు మహేష్ బాబు, రమేష్ సహా ఐదుగురు సంతానం. వీళ్లు కాకుండా మరో ముగ్గురు ఆడపిల్లలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు  హీరోగా నటిస్తున్నారు.  సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇందిరా దేవి మృతిపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించా రు. శ్రీమతి ఇందిరా దేవి గారు స్వర్గస్తులయ్యారనే వార్త తనను ఎంతో కలిచివేసిందన్నారు. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చూకూరాలని కోరుకుంటూ , సూపర్ స్టార్ కృష్ణగారికి, సోదరుడు మహేష్ బాబుకు , వాళ్ల కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.మరోవైపు జనసేనాని పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కూడా కృష్ణ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓ లేఖ విడుదల చేశారు.