మహేష్ బాబు కి ఎలాంటి మార్పులు అవసరం లేదు -రాజమౌళి

 మహేష్ బాబు త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు  ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.  తాజాగా హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ రాజమౌళి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు తన రొటీన్ లుక్కుతోనే కనిపిస్తారని, లుక్ పరంగా మహేష్ బాబు లో పెద్దగా మార్పు లేవీ ఉండవని అన్నారు. హెయిర్ స్టైల్ తప్పించి మహేష్ బాబు కూడా కృష్ణ లాగానే ఎక్స్పరిమెంట్లు చేయడానికి ఇష్టపడరు. కానీ రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఎలాంటి మార్పులైనా చేయడానికి సిద్ధమవుతారని అందరూ అనుకున్నారు కానీ రాజమౌళి స్వయంగా మహేష్ బాబు కి ఎలాంటి మార్పులు అవసరం లేదు అని అనడంతో మహేష్ బాబు కూడా తన ఒరిజినల్ లుక్కుతోనే కనిపించనున్నారు.