మచిలీపట్నం భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం నిధి సేకరణ

మచిలీపట్నం: ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ గారి పిలుపుమేరకు రాయలసీమ, నెల్లూరు ప్రాంతంలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని, వారికి సహాయం చేసి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు స్థానిక కోనే సెంటర్ వ్యాపారస్తులు దగ్గర నిధి సేకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర పదాధికరి N రాము బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గాయత్రి  యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు విట్టల్ సాయి యువ మోర్చా జిల్లా సెక్రెటరీ అరవింద్ బిజెపి జిల్లా సెక్రటరీ పద్మజ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు అంజనా దేవి బిజెపి పట్టణ అధ్యక్షులు హరికృష్ణ  మణికంఠ ఫణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు