నిజామాబాద్ జిల్లాలో బలవన్మరణానికి పాల్పడ్డ ప్రేమజంట.

నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం లక్ష్మాపూర్ అడవి ప్రాంతంలో మోస్రామ్ మండలం తిమ్మాపూర్ కి చెందిన మోహన్,లక్ష్మి గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం నుండి గ్రామంలో కనిపించకుండా పోయిన వీరు లక్ష్మాపూర్ అడవిలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గ్రామంలో కనిపించకుండా పోయిన రోజునే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఈరోజే అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరిద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.