నెల్లూరు జాయింట్ కలెక్టర్ గా కృష్ణ భారతి… మరి కొంత మందికి స్థాన చలనం

నెల్లూరుజిల్లా జాయింట్ కలెక్టర్ గా టి. కృష్ణ భారతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న జేసీగా ఉన్న వినోద్ కుమార్ ను బదిలీ చేసిన విషయం తెలిసిందేే. ఆయనస్థానంలోఅమరావతిలోని సి.ఆర్.డి.ఏ లో పనిచేస్తున్న కృష్ణ భారతిని జాయింట్ కలెక్టర్ గా నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డారు. మరో వైపు జిల్లాకు సంభందించి అనేక మంది బదిలీ కాగా వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న టి. బాపిరెడ్డిని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమించారు. నెల్లూరు కమిషనర్ గా కొత్త వారిని ఇంకా నియమించలేదు. దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. కలెక్టర్ చక్రధర్ బాబు కమిషనర్ గా ఐఏఎస్ అధికారిని సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇక పోతే జిల్లా రెవెన్యూ అధికారిగా ఉన్న మల్లిఖార్జునను టిటిడికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో డిఆర్వోగా ఎమ్.వి. రమణను నియమించారు. నెల్లూరు బీసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న టి. రాజగోపాల్ ను కడపకు బదిలీ చేశారు. నెల్లూరు సివిల్ సప్లైస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఎమ్. శ్రీదేవిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.