కృష్ణా జిల్లా అనుమానాస్పదంగా మృతి చెందిన వృద్ద దంపతులు..

కృష్ణా జిల్లా కంచికచర్లలో వృద్ధ దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతులు బండారుపల్లి నాగేశ్వరరావు, ప్రమీలారాణిగా గుర్తించారు. బెడ్‌ రూంలో విగతా జీవులుగా పడి ఉండడంతో దీన్ని హత్యగా భావిస్తున్నారు స్థానికులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.