ఖబర్దార్ కాంగ్రెస్ ద్రోహి రాజగోపాల్

భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు (మండలం) ఖబర్దార్ కాంగ్రెస్ ద్రోహి రాజగోపాల్. నోరు అదుపులో పెట్టుకో అని వైరా నియోజకవర్గ నాయకులు మాలోత్ రాందాస్ నాయక్. హెచ్చరించారు, మండల కేంద్రంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వైరా నియోజకవర్గనాయకులు రాందాస్ నాయక్ మాట్లాడుతూ, ఎంతో విశ్వాసంతో ఓటు వేసి గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ద్రోహం చేస్తున్నారని తెలిపారు, రాందాస్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి మారుతున్న రాజగోపాల్‌రెడ్డి అన్నం పెట్టిన అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీ, పెద్దలపై నోరు జారటం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే స్వార్థ రాజకీయాల కోసం ఆయన పార్టీ మారుతున్నాడని విమర్శించారు. డబ్బు అహంకారపు. రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని బ్రమ పడటం. మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే పుట్టగతులు ఉండవని రాందాస్ నాయక్ హెచ్చరించారు.