అమెజాన్ ప్రైమ్ లో కీర్తిసురేష్ పెంగ్విన్ చిత్రం..!

కరోనా వైరస్ కారణంగా థియేటర్లన్నీ మూతపడడంతో సినిమాలు విడుదల చేసుకోలేక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలుగు సినిమా “అమృతరామమ్” జి-5 లో విడుదల కాగా, అదే బాటలో “మహానటి” సినిమాతో జాతీయ అవార్డ్ దక్కించుకున్న హీరోయిన్ కీర్తిసురేశ్ ప్రధాన పాత్రధారిగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతోన్న “పెంగ్విన్‌” సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించారు. జూన్ 19న తెలుగు, మిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుందని ప్రకటించారు. ఈ సినిమాకి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈయనతో పాటు సంతానం, సుధన్‌, సుందరం, జయరామ్ ఇతర నిర్మాతలు.