ఉధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు వాగు.

కృష్ణా జిల్లా నందిగామ: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నందిగామమండలం వీరులపాడు మండలం మధ్య దాములూరు కూడలి వద్ద ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వైరా కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కట్టలేరు వాగుపై ఎవరు ప్రయాణం చేయకుండా నందిగామడిఎస్పి నాగేశ్వరరెడ్డి ఆదేశాలమేరకు దాములూరు కూడలి వద్ద నందిగామ రూరల్ సిఐ నాగేంద్ర కుమార్ వరద ప్రవాహాన్ని పరిశీలించి కట్టలేరు వాగు వద్ద సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రవాహం ఎక్కువగా ఉందని వీరులపాడు మండల ప్రజలు ఇటువైపు రావద్దని రవాణా సౌకర్యం లేకపోవడంతో రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపి వేశామని తెలిపారు. వరద ప్రవాహం తగ్గేవరకు ఎవరు ఇటువైపు రావద్దని సీఐ నాగేంద్ర కుమార్ ప్రజలకు తెలియజేశారు. అనంతరం సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వీరులపాడు ఎస్ ఐ సోమేశ్వర రావు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.