సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా?

రాజీనామా విషయంపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపా అధిష్ఠానం చెప్పినట్లు తాను నడుచుకుంటానని అన్నారు. తన భవిష్యత్తుపై జులై 25న అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు నాపై ప్రత్యేకమైన ప్రేమ, నమ్మకం ఉన్నాయి.75 ఏళ్లు నిండిన ఎవరికీ ఎలాంటి పదవులను భాజపా కట్టబెట్టలేదని తెలుసు.కానీ, నా పనితీరు నచ్చి 78 ఏళ్ల వయసున్న నాకు అవకాశం కల్పించారు.