దర్శక దిగ్గజాం కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇకలేరు
మూగబోయిన శంకరాభరణం ..ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇబ్బంది ఎక్కువ అవ్వడంతో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. విశ్వనాథ్ గారి మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
కళాతపస్వి సినీ ప్రస్థానం
కళాతపస్వి విశ్వానాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. 1930 ఫిబ్రవరి 19న జన్మించిన ఆయన.. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత వాహిని స్టూడియోస్‌లో సౌండ్ ఆర్టిస్టుగా తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. 1965లో అక్కినేని నాగేశ్వరావు కథానాయకుడిగా నటించిన ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా వచ్చిన కె.విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన సత్తాచాటారు విశ్వనాథ్.శుభసంకల్పం సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కె.విశ్వనాథ్.. వజ్రం, కలిసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వులేకనీను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్ వంటి పలు సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు.
. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు దూసుకుపోతున్న సమయంలోనే ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ రాణించారు. ఆయన సినిమాలు కొన్ని రష్యన్ భాషలోకి డబ్బింగ్ చేశారు కూడా. వాటిని మాస్కోలోని థియేటర్లలో విడుదల చేశారు.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన అద్భుతమైన సినిమాల్లో, భారతీయ చలనచిత్ర ఆణిముత్యాల్లో ‘శంకరాభరణం’ కూడా ఒకటి. ఈ సినిమాకు ఉత్తమ సినిమాగా నంది అవార్డు రావడమే కాక.. జాతీయ అవార్డు కూడా అభించింది.బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ ప్రోవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్’ విభాగంలో నేషనల్ అవార్డు అందుకుంది శంకరాభరణం. ‘సప్తపది’, ‘స్వాతిముత్యం’, ‘సూత్రధారులు’, ‘స్వరాభిషేకం’ సినిమాలకు కూడా నేషనల్ అవార్డులు అందుకున్నారు విశ్వనాథ్. ‘స్వాతి ముత్యం’ సినిమా అయితే ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 59వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా పంపించారు.చిత్రసీమకు విశ్వనాథ్ చేసిన సేవలకు గాను ఆయనను భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. అదే సంవత్సరంలోనే రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు.సినిమారంగంలో చేసిన కృషికిగాను 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 1992 లో న్నాడు. పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నాడు. అంతేకాక గల్ఫ్ ఆంధ్రా అవార్డు ఫర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ఇన్ సినిమా(యూఏఈ) అవార్డును కుడా 2014లో అందుకున్నారు.ఇంకా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను కూడా అందుకున్నారు.