ప్రజాభిమానం చూరగొన్న జగనన్న ప్రభుత్వం- కైకలూరు ఎమ్మెల్యే

పాలనను ప్రజలకు చేరువ చేసి..ఇంటివద్దకే సేవలను అందిస్తూ..ప్రజాభిమానం చూరగొన్న ప్రభుత్వం జగనన్న నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)
అన్నారు.ఈ ఉదయం కైకలూరు మండలం ఆచవరం గ్రామంలో జరిగిన వై.ఎస్.ఆర్ పింఛను కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పెంచిన మొత్తం తో పాత పింఛన్లతో పాటుగా కొత్త పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టో అమలులో జగనన్న సమకాలీన నాయకులకు ఆదర్శ ప్రాయుడని.. పెద్దఎత్తున ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అన్నారు.గతంలో రాష్ట్రం మొత్తం మీద 39 లక్షల మందికి నెలకు 1000 రూ.చొప్పున నెలనెలా400 కోట్లు ఖర్చు చేసేవారని..అదే జగనన్న నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 61లక్షల 55 వేల441 మందికి నెలనెలా 1564 కోట్లు ఖర్చు చేస్తున్నదని..అంటే 4 రెట్లు అధికంగా అందిస్తున్నారన్న విషయం ప్రజలు గ్రహించాలని అన్నారు.కరోనా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమాన్ని ఎక్కడా ఏ దశలోనూ ఆపకుండా అందించిన మనసున్న నేత మన జగనన్న అని అన్నారు.

ఇంత పెద్దఎత్తున సంక్షేమం అమలును చూసి తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే అక్కసుతో ప్రభుత్వ ఖజానాను పప్పు బెల్లాలు లాగా పంచేస్తుందని ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేస్తున్నాయి అన్నారు.ఆ సొమ్ము ప్రజలు కట్టిన పన్నుల సొమ్మేనని..అదే తిరిగి ప్రజలకు అందుతుందని అన్నారు.ఇది కూడా గ్రహించలేని స్థితిలో ప్రతిపక్షాలు ఉండడం శోచనీయం అన్నారు.గ్రామ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా స్వపరిపాలన,సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు.పథకాల కు దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు మండల కేంద్రాలకో, మరోచోటికో వెళ్లే అవసరం లేదని,మీ మీ ఊళ్లలోనే మీ సమస్యలు తీర్చే యంత్రాంగం ఉందని..ఒకటికి రెండు సార్లు మీ మీ వాలంటీర్లతో చెప్పి ఆరా తీసుకోవాలని అన్నారు.ఇచ్చిన మాటకు కట్టుబడి సంవత్సరం సంవత్సరం పెన్షన్ ను పెంచుకుంటూ పోతాం అన్న హామీ ని ఈరోజు మీకు పెంచి అందిస్తూ మీకు సంక్రాంతి పండగ ముందే తెచ్చారని అన్నారు.అనంతరం పెంచిన పింఛన్ల సొమ్ముతో పాటుగా జగనన్న సందేశం కవర్ లో పెట్టి లబ్ధిదారులకు అందజేశారు. మీ యొక్క ఆచవరం గ్రామ రహదారికి 24లక్షలు రూపాయలు ఇచ్చాను అని, అదేవిదంగా ఆచవరం గ్రామం నుంచి శ్యామలాంబపురం గ్రామానికి 30లక్షలు రూపాయలు నిధులతో రహదారి పనులు ప్రారంభిస్తున్నాం అని అన్నారు. ముఖ్యంగా గ్రామానికి 96.97లక్షలు రూపాయలు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరు చేసాం అని అన్నారు.

మన కైకలూరు నియోజకవర్గంలోని CHC హాస్పిటల్ లో,గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న ఆశీస్సులతో 5పడకల డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు చేయడానికి అనుమతులు వచ్చాయి అని అన్నారు.ఇది ఈ ప్రాంత వాసులకు చాలా మేలు చేస్తుందని అన్నారు.డయాలిసిస్ కొరకు దూరప్రాంత పట్టణాలకు వెళ్ళవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఎంపిపి అడవి కృష్ణ అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమంలో , జడ్పీటీసీ కూరెళ్ల బేబీ,,ఎంపిడిఓ వెంకటరత్నం, APM హెడ్ వార్డ్ , వైస్ ఎంపిపిలు మహ్మద్ జాహిర్, తెంటు సత్యనారాయణ, సర్పంచ్లు, కట్టా నాగరాజు, సంకు కోటేశ్వరరావు, ధర్మరాజుల నాగమ్మ, ఎంపీటీసీ బూర్ల నాగరాజు, నాయకులు,, ఉలిసి సత్యనారాయణ, మాడపాటి చింతయ్య, బూర్ల పోతురాజు, సన్నిధి కృష్ణ, బురబోయిన శ్రీనివాసరావు, బురబోయిన మోహనరావు, కట్టా లక్ష్మణరావు, బూర్ల విష్ణు, బూర్ల బోగేశ్వరరావు, ధర్మరాజుల వెంకటేశ్వర్రావు, మాడపాటి రాముడు, ఆవుల శ్రీనివాస్,, సచివాలయం సిబ్బంది, వాలంటరీలు,తదితరులు పాల్గొన్నారు*