త్యాగాన్ని క్షమను గుర్తుచేస్తూ, స్వార్థాన్ని త్యజించాలన్నదే ఈ పవిత్ర బక్రీద్ మనకు ఇచ్చే సందేశం.

ఈ పర్వదినం సందర్భంగా శాంతి సామరస్యాలతో సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని, కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని నమాజ్ లో ఆ అల్లాహ్ ను ప్రార్థించిన కడప అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్, వి.ఎస్.అమీర్ బాబు.
త్యాగాల ప్రతీక అయిన ఈ పర్వదినాన త్యాగ గుణం నర నరాన ఇంకీపోయే విధంగా అల్లాహ్ మనందరికీ అటువంటి వరాన్ని ప్రసాదించాలని. స్వార్థచింతన విడనాడి మానవాళి అందరూ అనే గుణం మనందరిలో రావాలని. మానవత్వాన్ని పరిమళించే విధంగా సమాజంలో ప్రేమానురాగాలు నలుమూలల మనం వ్యాప్తి చెయ్యాలని, హాజ్రత్ ఇబ్రహీం ఇలైహి సలాం లాంటి త్యాగ గుణం మనందరిలో రావాలని. స్వార్ధాన్ని విదనాడే త్యాగం మనందరిలో రావాలని, త్యాగం లేని జీవితం ఆత్మలేని శరీరంలాంటిది కాబట్టి “స్వార్ధాన్ని” ఈ పండుగ దినాన త్యాగం చేసి ఈ పండుగ యొక్క శుభాలను పొందే భాగ్యాన్ని మనందరికీ ఆ “అల్లాహ్” ప్రసాదించాలని. ప్రపంచంలో కానీ, దేశంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుభిక్షంగా అందరూ జీవించాలని. కరోనా రక్కసిని పారద్రోలాలని. నమాజ్ లో ఆ అల్లాహ్ ను దువా చేయడం జరిగింది. ముస్లిం సోదరిసోదరులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ. సుఖసంతోషాలతో ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని సందేశమిచ్చారు.