ఏపీఎండీసీ లోడింగ్ పనులు  ప్రస్తుతం ఉన్న మిషన్ లకు సమానంగా ఇవ్వాలి: సిఐటియు డిమాండ్

కడప జిల్లా  ఓబులవారిపల్లె  మండలం మంగంపేట  బరైటీస్ రాయి ఫ్లాట్ లో ప్రైవేటు కంపెనీలకు లోడింగ్ పనుల్లో స్థానికంగా ప్రస్తుతం పనిచేస్తున్న మిషన్ యజమానులకు సమానంగా పనులు కల్పించి ఉపాధి ఇవ్వాలని సిఐటియు కడప జిల్లా కార్యదర్శి  సిహెచ్ చంద్రశేఖర్ విలేకర్ల సమావేశంలో డిమాండ్ చేశారు.  ప్రిన్సిపల్ ఎంప్లాయి గా ఏపీఎండీసీ యాజమాన్యం  జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలకు, రాజకీయాలకు  అతీతంగా, మిషన్ లపై ఆధారపడి జీవనం పొందుతున్న వారి పొట్ట  కొట్టొద్దు అన్నారు. గతంలో ఏపీఎం డి సి ఆధ్వర్యంలో  30  మిషన్ లకు పనులు లోడింగ్ చేయించే  వారన్నారు, ప్రస్తుతం త్రివేణి కాంట్రాక్టర్ కి లోడింగ్  పనులు అప్ప చెప్పడం, దానిపై ఆధారపడిన స్థానికుల జీవనోపాధి పోతుందన్నారు. లోడింగ్ పనులు త్రివేణి కాంట్రాక్టర్ నుంచి మినహాయించాలి అన్నారు.  ఏపీఎండీసీ ఆధ్వర్యంలో  మిషన్ లూ ఉన్నవారు రిజిస్టర్ చేసుకొని,  రొటేషన్ పద్ధతులు లోడింగ్  పనులు అప్పజెప్పాలి అన్నారు.  పబ్లిక్ ప్రాపర్టీ లో,70%, 30%,  50% పర్సంటేజ్ లో  అధికారపార్టీ నాయకులు, వాటాలు తీసుకోవడం ఏమిటన్నారు. గతంలో బయ్యర్స్  డీజిల్ 60 రూపాయలు ఉన్నప్పుడు టన్నుకు  24 రూపాయలు ఇచ్చేవారని,ప్రస్తుతం వంద రూపాయలు డీజిల్ ధర దాటింది .కనుక ధరలకు అనుగుణంగా ధర  పెంచి నిర్ణయించాలి అన్నారు. ఈ ధర కూడా ఎక్స్పోర్ట్ కాంట్రాక్టర్లు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రస్తుతం మిషన్ యజమానులు చేస్తున్న  న్యాయమైన పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.