తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌

 ఢిల్లీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తిగా పని చేస్తోన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమోషన్ కల్పించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్రం తాజాగా గెజిట్ జారీ చేసింది.ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ ధీరూభాయ్ నరన్‌భాయ్ పటేల్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. మార్చి నెలలో జస్టిస్ విపిన్ సంఘీని తాత్కాలిక సీజే‌గా నియమించారు. బదిలీల్లో భాగంగా ఆయన్ను ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమించారు.