జర్నలిస్టులు స్వేచ్ఛ గా లేరు

ఇప్పుడున్న పరిస్థితుల్లో జర్నలిస్టులు గతంకన్నా ఎక్కువ విభజనకు గురయ్యారన్న భావన కనిపిస్తోంది. ప్రధాన మీడియాలో ఎక్కువ సంస్థలు మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయం ఉంది. ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడం తమ విధి కాదని ప్రభుత్వం భావిస్తోంది అని ‘ఫ్రీడమ్‌ హౌస్’‌ విడుదల చేసిన ఓ రిపోర్ట్‌ పేర్కొంది. జర్నలిస్టులు స్వేచ్ఛగా లేరని, 2020 సంవత్సరంలో 67మంది జర్నలిస్టులు అరెస్టయ్యారని, 200మందిపై దాడులు జరిగాయని ‘ఫ్రీస్పీచ్‌ కలెక్టివ్’‌ కోసం నిర్వహించిన ఓ స్టడీలో గీతాశేషు అభిప్రాయపడ్డారు