బూస్టర్ డోస్ తీసుకున్నజో బైడెన్.. టీకా తీసుకోని అమెరికన్లపై ఆగ్రహం

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. అమెరికా ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారు బూస్టర్ డోస్ తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు కూడా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వ్యాక్సిన్ తీసుకోవడానికి విముఖత చూపుతున్న ప్రజలు దేశానికి నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు.

దేశంలో కొంతమంది ప్రజలను కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తు్న్నారని, ఇలాంటి వారి వల్లే దేశంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికే అమెరికా ప్రజల్లో 77 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పిన ఆయన.. ఇంకా పావుభాగం మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. కాగా వ్యాక్సిన్ తీసుకునే సమయంలో ”నేను అంతలా కనిపించకపోయినా, నా వయసు 65 దాటింది’ అంటూ జోక్ చేశారు.