జయహో బీసీ మహాసభ పోస్టర్లు విడుదల – వైఎస్సార్ సీపీ నాయకులు
పుట్టపర్తి జిల్లా ధర్మవరం ఈనెల ఏడవ తేదీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో, “జయహో బీసీ మహాసభకు “సంబంధించిన వాల్పోస్టర్లను వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు, నాయకులు, ఇన్చార్జులు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి స్వగృహములో విడుదల చేశారు. అనంతరం ఉడుముల రామచంద్ర తదితర నాయకులు మాట్లాడుతూ నేడు వైఎస్ఆర్సిపి పాలనలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకపాత్ర వహిస్తున్నారని, మున్ముందు కూడా వారికి మరింత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ మహాసభలో కీలక అంశాలపై నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పెనుజూరు నాగరాజు ,సుభాన్ భాష, కత్తే పెద్దన్న, చింత ఎల్లయ్య, రమాదేవి, బాలం గోపాల్ , ఎస్పీ బాషా, రమణ ,మాసపల్లి సాయికుమార్, మేడాపురం వెంకటేష్ ,కోఆప్షన్ నెంబర్ కరీం తదితరులు పాల్గొన్నారు.