ఏపీ బీజేపీ ఇంఛార్జ్‌కి జనసేనాని పవర్ఫుల్ విషెస్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్‌ దియోధర్‌ కు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీ సాహసోపేత ప్రభావం నాయకత్వ పటిమ ప్రజలను చైతన్య పరుస్తూ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ప్రజలకు చేరువయ్యేందుకు తెలుగు నేర్చుకోవాలనే అభిలాష, మీరు తీసుకున్న బాధ్యత అంకితభావం నిబద్ధత ను ప్రతిబింబిస్తున్నాయి. మీ మార్గదర్శకత్వంలో బీజేపీ-జనసేన కచ్చితంగా విజయ పథంలో పయనిస్తుంది. ఆరోగ్యం దీర్ఘాయుష్షుతో భవాని మాత మిమ్మల్ని ఆశీర్వదించి దేశానికి సేవ చేయడానికి ఉన్నత పదవులు అందించాలని కోరుకుంటున్నాను. అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.