వినూత్నంగా జనసైనికుడి పెళ్లి పత్రిక

రామచంద్రపురం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన బండారు భద్ర అనే యువకుడు తన వివాహ ఆహ్వాన పత్రికను అందరికీ భిన్నంగా జనసేన పార్టీ సిద్ధాంతాలకు అద్దం పట్టే విధంగా రూపొందించి మండలంలోనే కాక జిల్లా జనసేన నాయకుల మొత్తం చూపును తన వివాహం వైపు తిప్పుకునేలా చేసారు. జనసేన సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ వారాహి వాహనం ఫోటోలు ఈ శుభలేఖ పైన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.తనకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ఇష్టమని ఆ దేవుని ఆశీస్సులతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు కూడా కావాలని ఈ సందర్భంగా బండారు భద్ర తెలియచేసారు.