విపత్కరం లోనే కాదు అంత్యక్రియలోనూ ఆసరాగా జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్

కోవిడ్ విలయతాండవం చేస్తున్న వేళ మానవవిలువలు మృగ్యమయ్యాయి. తోటి వారికి కష్టం వస్తే పట్టించుకొనేవారే కరువయ్యారు.స్వంత బంధువులు కూడా కోవిడ్ భయంతో దూరంగా ఉంటున్నారు.ఇలాంటి నిశీధిలో నేనున్నానంటూ జక్కంపూడి రామ్మోహనరావు పౌండేషన్ ముందుంటుంది.భాదితులకు ఆసరాగా నిలుస్తోంది. కొండంత భరోసా ఇస్తుంది. విలువైన ప్రాణాలు నిలబెడుతుంది. ప్రాణాపాయ స్థితి లొనే కాదు.దహన కాండల్లోనూ ఆటంబంధువుగా నిలుస్తోంది. అందుకు నిదర్శనం ఈ సంఘటన . కడియం మండలం దుళ్ల గ్రామంలో అంగన్ వాడీ టీచర్ గా సేవలు అందిస్తున్న మద్దిరెడ్డి గన్నెమ్మ క్యాన్సర్తో రాజమహేంద్రవరం లోని ఆమె చెల్లెలు నివాసంలో మృతిచెందింది. అంత్యక్రియలకోసం ఆమె పార్ధీవదేహాన్ని దుళ్లలో ఖననం చేయాలని వారి బంధువులు భావించారు.అందుకు అంబులెన్సు లను సంప్రదించగా 25 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి 10 వేల రూపాయలు పైగా డిమాండ్ చేశారు.కొన్ని వాహనచోదకులైతే కోవిడ్ అనుమానంతో తీసుకెళ్లడానికి నిరాకరించారు.ఇలాంటి సమయంలో జక్కంపూడి రామ్మోహనరావు పౌండేషన్ ప్రతినిధులు పట్నాయక్,కొత్తపల్లి మూర్తి లను సంప్రదించగా క్షణాల్లో ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేసి గన్నెమ్మ కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిచారు.పౌండేషన్ కు సంబందించి వాహన డ్రైవర్లు డ్యూటీలు మరే వేళ కావడంతో ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేసి వారి దాయర్ద్రసేవా వికాసాన్ని కనబర్చారు.
కోవిడ్ సేవలో పునీతం అవుతూనే స్వచ్ఛంద సేవకు కూడా వారు కంకణబద్ధులవుతున్నారు.

రాజమహేంద్రవరం సిటీ,రూరల్,రాజానగరం నియోజకవర్గాల్లో కోటిరుపాయల పైగా వ్యయంతో కోవిడ్ భాదితుల కోసం అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు.వైఎస్ఆర్సీపీ కేంద్రకమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ,ఎమ్మెల్యే రాజా,గణేష్ ఆపన్నుల ను ఆదుకొనేందుకు రేయింబవళ్లు వారి తలుపులు తెరిచే ఉంచుతున్నారు.వారు ఏర్పాటు చేసిన జక్కంపూడి పౌండేషన్ టోల్ ఫ్రీ no ను సంప్రదించినా సేవాలందించడానికి పెద్ద నెట్ వర్క్ నే ఏర్పాటు చేశారు.కోవిడ్ రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసి పోయాయి. ఎవరైనా అత్యవసరంగా అసుపత్రిలో చేరాలంటే కొన్ని గంటలు కొన్ని సందర్భాల్లో రోజులు కూడా వైట్ చేయాల్సిన పరిస్థితి. లక్షలు చెల్లిస్తామన్నా వైట్ అంటున్నాయి ఆసుపుత్రులు.ఇక ఫ్రీ (ఆరోగ్యశ్రీ)బెడ్ అంటే గగనమే..ఈ లొనే చాలామంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఇలాంటి విపత్కర సమయంలో కోవిడ్ భాదితులకు అండగా నిలుస్తూ పూర్తి ఉచితంగా కోవిడ్ భాదితులకు సేవాలందిస్తున్నారు.mla రాజా తన పూర్తి పరపతిని ఉపయోగించి ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఏయే ఆసుపత్రుల్లో రోజుకు ఎంత మంది కోవిడ్ పేషెంట్స్ చికిత్స పొందుతున్నారు.ఎంతమంది డిచార్జి అవుతున్నారు.ఎక్కడెక్కడ బెడ్స్ ఖాళీ అవుచున్నాయి వంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి జక్కంపూడి ఫౌండేషన్ ఆన్లైన్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకొంది.వారి ప్రతి’నిధులు’ 24 గంటలు ఈ సమాచారాన్ని సేకరిస్తారు.పాండేషన్ ను ఆశ్రయించిన రోగులకు క్షణాల్లో ఆదుకొంటుంన్నారు.అవకాశాన్ని బట్టి ఆసుపత్రిల్లో చేర్చి సేవలందిస్తున్నారు.అందుకు అనుగుణంగా ఉచిత అంబులెన్స్లు సమకూర్చారు. తమను ఆశ్రయించిన ఒక్క రోగి ప్రాణం కూడా పోగూడదనే మహా సంకల్పం తో అత్యవసర ఆక్షిజన్ వైటింగ్ హాల్స్ ఏర్పాటు చేసి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.జక్కంపూడి ఫౌండేషన్ టీమ్ కులం,మతం, వర్గం,బేధం లేకుండా అభయ హస్తం అందిస్తున్నారు.నాటి కడియం నియోజకవర్గాన్ని కొంగుబంగారంలా మార్చి ప్రజాజీవితంలో మహానేతగా చెరగని ముద్ర వేసుకున్న స్వర్గీయ జక్కంపూడి రామ్మోహనరావు స్ఫూర్తిని మరిపిస్తున్న ఆయన కుటుంబానికి వేనోళ్ళ ప్రశంసలు అందుతున్నాయి.