బన్నీ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నా జాహ్నవి కపూర్

అల్లు అర్జున్  ప్రస్తుతం పుష్ప సినిమా సక్సెస్ ను ఓ రేంజ్ లో ఎంజయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.   సుకుమార్ దర్శకత్వంలో డిసెంబరు 17న రిలీజైన అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా అందరి ఆకట్టుకుందనే చెప్పాలి. మొదట్లో సినిమా పై మిక్స్డ్ టాక్ రాగా ఆ తరువాత ఆ సినిమా కోసం బన్నీ పడ్డ కష్టం చూసి అభిమానులు ఆసినిమా ను గా బాక్స్ ఆఫిస్ వద్ద నిలబెట్టారు. అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప-ది రైజ్. ఇక ఈ సినిమా రీసెంట్ గానే అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాను చూసిన స్టార్ సెలబ్రిటిస్ తమదైన స్టైల్లో బన్నీ పై పొగడ్తల  వర్షం కురిపిస్తున్నారు.  తాజాగా  శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఈ సినిమా చూసిందట. ఇక ఈ సినిమా చూశాక బన్నీ గురించి తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. ‘ది కూలెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ ‘అంటూ క్యాప్షన్ ఇచ్చి..‘మైండ్ బ్లోయింగ్’ అన్న జిఫ్ ఇమేజ్ ను సైతం పోస్ట్ చేస్తూ తనకు పుష్ప సినిమా ఎంత బాగా నచ్చిందో చెప్పుకొచ్చింది. కాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ పుష్ప సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలైన సంగతి తెలిసిందే.