నాని దసరా మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్

‘దసరా’ సినిమా తో  ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో నాని  ఉన్నాడు.  సుధాకర్  చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని సరసన నాయికగా కీర్తి సురేశ్ కనిపించనుంది. ఆయన కాంబినేషన్లో ఆమెకి ఇది రెండో సినిమా.   ఈ సినిమాలో నాని పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నాడు. రామగుండం బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా పేరు ‘దసరా’ కావడంతో  ‘దసరా’ పండుగ కానుకగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.  ఈ విషయాన్ని నానితో ఎనౌన్స్ చేయిస్తూ చిన్నపాటి వీడియో ఒకటి వదిలారు. ఈ సినిమాకి సంతోష్  నారాయణ్ సంగీతాన్ని సమకూర్చాడు. రాజేంద్ర ప్రసాద్ , ప్రకాశ్ రాజ్ సముద్రఖని,  ముఖ్యమైన పాత్రలను పోషించరు