జగన్ అసమర్థ పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది- దేవినేని, తంగిరాల

కృష్ణాజిల్లా నందిగామ: జగన్ ఆసమర్ధ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా దశలో ఉందని తుఫాను బాధితులను కూడా ఆదుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదని రాష్ట్ర మాజీ జలవనరుల శాఖ మాత్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్య అన్నారు. పరిటాల గ్రామమునందు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను నందిగామ మాజి శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య తో పాటు రైతులు టిడిపి నాయకులు కార్యకర్తలు తో కలసి గురువారం ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ జలవనరుల శాఖ మాత్యులు దేవినేని ఉమ మాట్లాడుతూ రాష్ట్రంలో లో అధిక వర్షాల వల్ల ఆరు జిల్లాలు ప్రజలు ఆస్తులతో పాటు ప్రజలు నీటమునిగి తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వారిని ఓదార్చే లిసింది పోయి చోద్యం చూస్తూ ఉన్నారే తప్ప ఏ మంత్రి అయినా సరే ఏ ఎమ్మెల్యే కూడా అటువైపు తిరిగి చూసి వారిని ఆదుకునే నాధుడే లేడని ఆయన మీడియా వద్ద వాపోయారు. ప్రధాన ప్రతిపక్షం నాయకుడైన చంద్రబాబు నాయుడు టిడిపి నాయకులు తో కలిసి గత మూడు రోజుల నుంచి వరద బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు మంత్రులు కానీ బాధ్యత లేదా అని దేవినేని ఉమా ప్రశ్నించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వరద బాధితులను పరామర్శించడానికి టైం లేదు కానీ శుభకార్య లకు పక్క రాష్ట్ర సీఎంని కలవటానికి మాత్రం రాష్ట్ర సీఎం టైం ఉంటుందని ఉమా ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ ను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు తుఫాన్ వల్ల పెన్నా నదికి వరద నీరు అధికంగా చేరి నది గట్లు తెగి పలు గ్రామాల పై వరద నీరు ముంచెత్తడంతో ప్రాణ నష్టం జరిగిందన్నారు వారికి ప్రభుత్వం తక్షణ సహాయం చేయాలని ఉమా డిమాండ్ చేశారు. పరిటాల గ్రామమునందు 1 7 00 ఎకరాల ఆయకట్టు ఉండగా అందులో వరి పంట 400 ఎకరాలు రైతుల వేశారన్నారు ఆ వరి పంట లు నీట మునిగితే ఏ ఒక్క అధికారి కూడా పొలాలను పర్యవేక్షించే లేదన్నారు ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు పర్యవేక్షించి పంట నష్టం నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందించాలని ఉమా కోరారు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 30 వేల చొప్పున పంట నష్ట పరిహారం చెల్లించాలని ఉమా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యులు కోగంటి బాబు, తెలుగు రైతు అధ్యక్షులు మాగంటి నరసింహారావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మాగంటి పుల్లారావు,దామినేని భాస్కరరావు, మాధవరావు మాగంటి బుజ్జి,టిడిపి మండల ఉపాధ్యక్షులు పంచాయితీ వార్డు మెంబర్ గుత్తా ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.