కేంద్రాన్ని సహాయం అడిగిన భారత ఒలింపిక్‌ సంఘం..!

కరోనా విజృంభణ కారణంగా ఆర్థికంగా అతలాకుతలమైన క్రీడా సంఘాలకు చేయూతనివ్వాలని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా సంఘాలను ఆదుకోవడానికి రూ. 200 కోట్ల మేర సాయం చేయాలని క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజుకు భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా లేఖ రాశారు. ప్రభుత్వం సాయం అందించకపోతే లాక్‌డౌన్‌ తర్వాత క్రీడా కార్యకలాపాలను నడపడం కష్టమని ఆ లేఖలో వివరించారు. ఆ సంక్షోభం నుంచి బయట పడాలి అంటే ఐఓఏకు రూ.10 కోట్లు, జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ.5 కోట్లు, రాష్ట్ర ఒలింపిక్‌ సంఘాలకు రూ. కోటి చొప్పున సాయం చేయాలని బాత్రా కోరారు.