రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

భారత్-న్యూజిలాండ్  మధ్య కాన్పూరులోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో జ‌రుగుతోన్న‌ తొలి టెస్టు మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకున్న విష‌యం తెలిసిందే. భార‌త ఓపెన‌ర్లు మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్ ఔట‌య్యారు. మ‌యాంక్ అగ‌ర్వాల్ 28 బంతుల్లో 13 ప‌రుగులు చేయ‌గా, శుభ‌మ‌న్ గిల్ 93 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ప్ర‌స్తుతం క్రీజులో ఛ‌టేశ్వ‌ర్ పూజారా (15), అజింక్యా  ర‌హానె (0) ఉన్నారు. టీమిండియా స్కోరు  31 ఓవ‌ర్ల‌కు 82/2 గా ఉంది.