ఆక్సిజన్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వొద్దు: మోదీ

దేశంలో కరోనా విరుచుకుపడుతున్న నేపథ్యంలో రోగులకు అవసరమైన ఆక్సిజన్‌ అందుబాటు పై కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ (రోగులకు అవసరమైన ఆక్సిజన్‌) ఉత్పత్తిని పెంచాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.  కీలక సమీక్ష నిర్వహించారు  ఆక్సిజన్‌ కొరత తలెత్తకుండా అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలన్నారు.  దేశంలో ఆక్సిజన్‌ సరఫరా పరిస్థితి, వచ్చే 15 రోజుల్లో కరోనా తీవ్రంగా ఉన్న 12 రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, ఛత్తీ్‌సగఢ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, హరియాణా, రాజాస్థాన్‌) ఎంతమేరకు ఆక్సిజన్‌ అవసరం అన్న దానిపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. తీవ్ర ప్రభావిత 12 రాష్ట్రాల్లో జిల్లా ల వారీగా పరిస్థితులను అధికారులు ప్రధానికి తెలిపా రు. వైద్య ఆరోగ్య, ఉక్కు, రవాణామంత్రిత్వశాఖకు చెం దిన ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రాల నుంచి 10 లీటర్ల సిలిండర్లు, 45 లీటర్ల జంబో సిలిండర్ల కోసం అదనపు వెంటిలేటర్ల కోసం వస్తున్న డిమాండ్లను పూరిస్తామని కేంద్ర ఆరోగ్యకార్యదర్శి ప్రధానికి తెలిపారు.