నూతన దుకాణాల సముదాయ ప్రారంభోత్సవం
లలితాంబికా దుకాణాల సముదాయంలో నూతనంగా నిర్మించిన 36 గదుల వాణిజ్య సముదాయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మరియు ఈవో లవన్న పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భ్రమరాంబికా వాణిజ్య సముదాయం పేరున దుకాణాలు నిర్మించారు. ఉదయం గం.8.44 ని.లకు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు ఈ దుకాణాలను ప్రారంభించారు.నాలుగు నెలలలో భ్రమరాంబ వాణిజ్య సముదాయాన్ని నిర్మాణము పూర్తి చేశారు ఈ ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.
దుకాణదారులకు షాప్ తాళాలు అందజేసిన చైర్మన్
డిప్ ద్వారా కేటాయించిన దుకాణాల దారులకు లలితాంబిక వాణిజ్య సముదాయం మరియు భ్రమరాంబ వాణిజ్యసముదాయంలో డిప్ ద్వారా తీసుకున్న దుకాణ యజమానుదారులకు తాళంచెవులు అందించే ప్రక్రియ ఉదయం ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి షాప్ యజమాను దారులకు తాళం చెవులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఈవో ఈవో లవన్న ధర్మకర్తల సభ్యులు పాల్గొన్నారు.