త్వరలోనే కరోనా విముక్త భారత్ గా నిలవాలని కోరుకుంటున్నా: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.

కరోనా మహమ్మారి నుండి భార‌త్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ప్ర‌పంచ‌మంతా ఏక‌మై మ‌హ‌మ్మారిపై పోరాడాల‌ని ఈ సందర్బంగా ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న ఈ స‌మ‌యంలో తాము భార‌త ప్ర‌జ‌ల కోసం ప్రార్థిస్తున్నామ‌ని పాకిస్థాన్ స‌మాచార శాఖ మంత్రి ఫ‌వ‌ద్ హుస్సేన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ కష్ట స‌మ‌యంలో మా భార‌త ప్ర‌జ‌ల కోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు ద‌య చూపాలి. త్వ‌ర‌లోనే ఈ క‌ష్టాలు తొలగిపోవాలి అని ఆయ‌న శ‌నివారం ట్వీట్ చేశారు. ఇటు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ను అన్ని రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.