విభజన హామీలు అమలు చేయండి : లోక్ సభలోతెదేపా డిమాండ్

 విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌ నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో మాట్లాడిన రామ్మోహన్‌ నాయుడు.. దేశ అవసరాల దృష్ట్యా బిల్లును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ”విశ్వవిద్యాలయాల సవరణబిల్లులో అదనపు వర్సిటీలను ప్రతిపాదించారు. ప్రాంతీయ కేంద్రాలను కేంద్రం బిల్లులో ప్రతిపాదించింది.ఈ రెండింటిని విశాఖలో ఏర్పాటు చేయాలి. గతంలోనే భూములిచ్చినా.. కేంద్ర సంస్థల నిర్మాణాలు ఏపీలో నెమ్మదిగా సాగుతున్నాయి. తగిన నిధులు కేటాయించి త్వరిత గతిన నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్రంలో ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, సెంట్రల్‌ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీకి స్థలాలు కేటాయించినా నేటికీ నిర్మాణాలు పూర్తి కాలేదు. గిరిజన వర్సిటీకి కేంద్రం తన వాటాను ఖర్చు చేసి వెంటనే వర్సిటీని ఏర్పాటు చేయాలి” అని రామ్మోహన్‌ నాయుడు కోరారు.