పౌష్టికాహారం మాసోత్సవాలు నిర్వహించిన ఐ సి డి ఎస్ సూపర్వైజర్.

కృష్ణాజిల్లా నందిగామ గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని ఐ సి డి ఎస్ సూపర్వైజర్ జ్యోజి కటాక్షమ్మ సూచించారు. కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ కంచికచర్ల పరిధిలో గల పెండ్యాల సెక్టార్ సూపర్వైజర్ జ్యోజి కటాక్షమ్మ ఆధ్వర్యంలోగండేపల్లి గ్రామంలో మంగళవారం పోషకాహార మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు అవగాహన కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోజి కటాక్షమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలితంతలకు పుష్టికరమైన ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. గర్భిణి స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యకరంగా, ఎదుగుదలకు తోడ్పడుతుందని అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లులు, పిల్లలు మాత్రమే తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా గ్రామంలో ప్రి ప్రైమరీ స్కూల్ కూడా త్వరలో ప్రారంభం అవుతు న్నాయి అని ,వాటికి సంబంధించి అన్ని బోధన సామగ్రిని ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొక్క రవి కుమార్, ఉపసర్పంచ్ బి వి సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సెక్టార్ పరిధిలో గల వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్స్, గర్భిణి స్ర్తీలు, బాలింతలు, పాల్గొన్నారు.