యువకుడిపై చేయి చేసుకున్న ఇబ్రహీంపట్నం మహిళ ఎస్ ఐ మణి

గుంటుపల్లి గ్రామానికి చెందిన సిరియాల ప్రవీణ్ అనే యువకుడు అదే గ్రామం లో పాల కోసం వెళ్ళాడు. పాల కోసం వెళ్ళేటప్పుడు ఇబ్రహీంపట్నం మహిళ ఎస్సై మణి యువకుని ఆపి ప్రశ్నించగా తాను పాలు కోసం వెళ్తున్నానని వెళ్లేటప్పుడు పోలీసులు ఆపి తన మీద కేసు రాశారని అందుకు సమ్మతించానని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అని బదులు ఇచ్చాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలుకి గురైన ఎస్.ఐ నాకే ఎదురు సమాధానం చెప్తావా అంటూ అసలు నీది ఏ ఊరు,ఏ కులం, నీ లీడర్ ఎవరు అంటూ దురుసుగా బూతులు మాట్లాడుతూ యువకుడి మీద చేయి చేసుకున్నారు. కర్ఫ్యూ లో అత్యవసర వస్తువుగా పాల కోసం వెళ్లానని, పోలీసులు కేసు రాసిన భరించానని, అయినా కూడా తన మీద దురుసుగా తీవ్ర పదజాలంతో దూషిస్తూ చెయ్యి చేసుకోవటం ఎంతవరకు సబబు అని యువకుడు విచారం వ్యక్తం చేస్తున్నారు. యువకుడిపై ఎస్ ఐ చేయి చేసుకున్న సీసీ కెమెరా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం ఇబ్రహీంపట్నం సిఐ తెలియజేయగా విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారని యువకుడు తెలిపాడు. ఈ మహిళ ఎస్సై పై గతంలో కూడా పలు సందర్భాలలో దురుసు ప్రవర్తన, నిర్లక్ష్య ధోరణి పై పలు విమర్శలు తలెత్తాయి. గుంటుపల్లి గ్రామం లో మహిళ ఎస్సై పై ప్రజల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.