జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదొ అర్థం కావడం లేదు : అమిత్ మిశ్రా

భారతీయ క్రికెట్ జట్టు సెలెక్ట‌ర్ల తీరుపై ఇటీవ‌లే సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా, మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో మరో భార‌త సీనియ‌ర్ స్పిన్న‌ర్ అమిత్ మిశ్రా చేరాడు.
మూడు సంవత్సరాల క్రితం చివ‌రిసారిగా భార‌త జ‌ట్టు త‌ర‌పున న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ లో ఆడిన అమిత్ మిశ్రా, త‌న చివ‌రి మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న న‌మోదుచేయడంతో పాటు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డుల‌ను కూడా ద‌క్కించుకున్నాడు. కానీ ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

అమిత్ మిశ్రా మాట్లాడుతూ – ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ లో గాయానికి గురైన త‌న‌ను టీమ్ సెలెక్ట‌ర్లు తర్వాత ప‌ట్టించుకోలేదని, ఇప్ప‌టివ‌ర‌కు త‌న‌ను జట్టులోకి ఎందుకు ఎంపిక చేయ‌డంలేదో అర్ధం కావ‌డం లేద‌ని తెలిపాడు.
అలాగే గాయానికి గురైన అనంత‌రం, నేష‌న‌ల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుని పూర్తి ఫిట్‌గా మారి, మ్యాచ్ స‌న్న‌ద్ధ‌త కోసం ఐపీఎల్లో 22 వికెట్లు తీసిన‌ట్లు తెలిపాడు. కానీ అవేమీ సెలెక్టర్లు పట్టించుకోవడంలేదని అన్నాడు.