హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ రద్దు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రాని నేపథ్యంలో ఆగస్టులో జరగాల్సిన హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని రద్దు చేయడం జరిగింది. ఆగస్టు 11 నుంచి 16 వరకూ జరగాల్సిన బ్యాడ్మింటన్ టోర్నీని రద్దు చేస్తున్నట్టు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయించింది. కరోనా సృష్టించిన క్లిష్టమైన పరిస్థితులు నుంచి ఎప్పటికి బయటపడతామో తెలియని కారణంగా టోర్నీని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బాయ్) అంగీకరించిందని వెల్లడించింది. ఇక ఇతర దేశాల్లో నిర్వహించాల్సిన టోర్నీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని బీడబ్ల్యూఎఫ్ కార్యదర్శి థామస్ లాండ్ వెల్లడించారు.