ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 13,923 శాంపిల్స్ పరీక్షించగా 435 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో విదేశాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 126 మంది ఉన్నారు. విదేశాలు, పొరుగు రాష్ట్రాలు, ఏపీకి చెందినవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,496కు చేరింది. గడచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,983 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ 92 మంది చనిపోయారు. ప్రస్తుతం 2,779 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.