వైద్యం నిమిత్తం కేరళకు వెళ్లనున్న- హీరో విశాల్

​మరోసారి షూటింగ్​లో తీవ్రంగా గాయపడ్డా తమిళ కథానాయకుడు విశాల్. ‘లాఠీ’ సినిమా క్లైమాక్స్​ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఫైటింగ్ సీన్ లో చేతి ఎముకకు తీవ్ర గాయమైంది. . దీంతో వెంటనే చికిత్స కోసం ఆయన్ను ఆస్పత్రికి తరలించింది మూవీటీమ్​. అనంతరం వైద్యం నిమిత్తం కేరళకు వెళ్లినట్లు హీరో విశాల్ ట్విట్ చేసారు.