ఎస్ ఎన్ ఎస్ పతాకంపై రెండవ చిత్రం

ప్రముఖ సినీ నిర్మాత రూప జగదీష్ సమర్పణలో శ్రీ నీలకంఠశ్వర స్వామి క్రియేషన్స్ ప్రొడక్షన్ ( ఎస్ఎన్ఎస్ ) ఆధ్వర్యంలో 2 వ చిత్రం థ్రిల్లర్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని చిత్ర మందిర్ ఫిలిం స్టూడియో లో గురువారం ప్రారంభం అయినట్లు ప్రముఖ సినీ నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి సంజీవ్ తెలిపారు.గురువారం నాగిరెడ్డి సినిమా షూటింగ్ వివరాలు వెల్లడించారు.ప్రముఖ సినీ దర్శకులు జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వ పర్యవేషణ అలాగే గరుడ వేగ అంజి దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపారు. హీరో లు గా సునీల్ దనురాజ్ హీరోయిన్ గా చాందినీ సహనటులుగా భూపాల్, పోసాని , రాజురవిందర్ , నల్ల వేణు, నటిస్తున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అలాగే ఇతర ప్రదేశాలలో మొదటి షెడ్యుల్ జరుగుతున్నట్లు తెలిపారు. జూన్ 24 నుండి జూలై 15 వరకు షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందని తెలిపారు.