అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో విస్తారమైన వర్షాలు

వాయువ్య బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడిన కారణాన తూర్పు, మధ్యభారతంలోని చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌, బిహార్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని, ఇందుకు అవసరమైన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పింది. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, బెంగాల్‌, జార్ఞండ్‌, బీహార్‌లో వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని వాతావరణ శాఖ చెప్పింది