ఆర్థిక ఇబ్బందుల్లో హరిహర వీరమల్లు నిర్మాతలు

 క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” అనే సినిమాతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఐదు విభిన్న భాషల్లో విడుదల కాబోతూ పవన్ కళ్యాణ్ మొదటి ప్యాన్ ఇండియన్ సినిమా కానుంది. ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పలు కారణాల వల్ల ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో చిత్ర నిర్మాత ఏ.ఎం రత్నం లోన్ ఇంట్రెస్ట్ లు కట్టుకోలేక ఇబ్బందులు పడి పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇన్ని రోజులు ఆలస్యం కావడంతో బడ్జెట్ కూడా రెండు వందల కోట్లకు చేరినట్లు సమాచారం. దీంతో నిర్మాతలకి కంగారు మొదలైంది.