ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు-పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యం లో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 255వ రోజున 54వ డివిజన్లో వెంకటేశ్వరపురం లక్ష్మీ వీధిలో గురువారం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల మధ్య రిపబ్లిక్ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్చాయుతమైన జీవితాన్ని గడుపుతున్నారంటే అది రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించిన హక్కు అని అన్నారు. ఈ దేశ సార్వభౌమత్వాన్ని, స్వేచ్చాయుతమైన వాతావరణాన్ని దె…