ముగిసిన 44 జిఎస్టీ కౌన్సిల్ సమావేశం.

ఢిల్లీ: కరోనా ఔషధాలు, పలు వైద్య పరికరాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కౌన్సిల్. నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్ధికమంత్రి
కరోనా ఔషధాలు, కొన్ని వైద్య పరికరాలపై పన్నుల తగ్గింపు. అంబులెన్స్‌ సేవలపై 28శాతం జీఎస్టీ నుంచి 12 శాతానికి తగ్గింపు.
టోసిలిజుమాబ్, యాంఫోటెరిసిన్ బి ఔషధాలపై పన్ను మినహాయింపు. రెమ్‌డెసివిర్ ఔషధంపై జిఎస్టీ 12% నుంచి 5% శాతానికి తగ్గింపు.
ఆక్సిజన్‌ యూనిట్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి యంత్రాలు, వెంటిలేటర్లు, ఇతర సంబంధిత పరికారాలపై జిఎస్టీ. 12% నుంచి 5% జీఎస్టీ తగ్గింపు.
కోవిడ్ టెస్ట్ కిట్లు, యంత్రాలపై జిఎస్టీ 5%శాతానికి తగ్గింపు. వ్యాక్సిన్లపై 5% జిఎస్టీ కొనసాగింపు. ఉష్ణోగ్రతలు లెక్కించే పరికరాలు, శానిటైజర్లపై జిఎస్టీ 18% నుంచి 5% శాతానికి తగ్గింపు. ఈ జిఎస్టీ తగ్గింపులు, మినహాయింపులు సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం.