కోడూరు మండల పరిధిలో జిల్లా పరిషత్ నిధులతో జి ఎస్ పి రోడ్ పనులు ప్రారంభం.

కోడూరు మండల పరిధిలోని పోటు మీద గ్రామంలో జిల్లా పరిషత్ నిధులతో మోతుకూరి గురునాథం ఇంటి వద్ద నుంచి స్మశాన వాటికకు వెళ్లే రహదారి 250 మీటర్లు సుమారు 4 లక్షల 50 వేల రూపాయల నిధులతో జి ఎస్ పి రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ ఉప్పల లక్ష్మీ కనకదుర్గ, వెంకటేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసిపి కన్వీనర్ కడవకోల్లు నాగమల్లేశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి కడవ కొల్లు వెంకటేశ్వరరావు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.