ఘనంగా74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో పలుచోట్ల గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆవిష్కరించారు. సంగం మండలంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో జాతీయ జెండాను సీఐ రవి నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 26 రిపబ్లిక్ డే గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు..