సాగు చట్టాల రద్దుపై చర్చకు మినహా రైతులతో చర్చకు సిద్దమన్న కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌.

సాగు చట్టాల రద్దుపై చర్చ కాకుండా రైతులతో ప్రత్యామ్నాయాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్పష్టం చేశారు. గతేడాది నవంబర్‌ నుంచి మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం రైతులతో మాట్లాడిందని, మళ్లీ చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బిల్లుల రద్దు కాకుండా ఇతర అంశాలపై చర్చించేందుకు రైతు సంఘాలు సిద్ధంగా ఉంటే వారితో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతులు తగ్గట్లేదు.. కేంద్రం దిగిరావట్లేదు.