ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలపై ప్రభుత్వం క్లారిటీ

పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్లారిటీ ఇచ్చారు. జూలైలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పరీక్ష హాలులో 12 మంది విద్యార్థులతో మాత్రమే పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.